Osmania University: ఓయూలో నేడే భారతీయ సాంస్కృతిక సమ్మేళనం
Osmania University: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో భారతీయ సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది.
Osmania University: ఓయూలో నేడే భారతీయ సాంస్కృతిక సమ్మేళనం
Osmania University: ఉస్మానియ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో ఆదివారం 26 ఏప్రిల్ సాయంత్రం 06 గంటలకు జరగబోయే భారతీయ సాంస్కృతిక సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను ఓయూలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు మరియు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్,
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ పాల్గొంటారని తెలిపారు.150 ఏళ్ల వందేమాతరం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశ భక్తి మరియు భారతీయ సంస్కృతి తెలియజేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు .దేశభక్తి మరియు మన సంస్కృతి విద్యార్థుల్లో పెంపొందించే విధంగా వక్తల సందేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మేధావులు, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగుకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.




