Malkajgiri: ఉత్తమ కూచిపూడి అకాడమీగా మల్కాజిగిరి ‘భావనలయ’కు జాతీయ అవార్డు!

Malkajgiri: నాగపూర్‌లో జరిగిన అఖిల భారత నృత్య పోటీల్లో మల్కాజిగిరి భావనలయ నృత్య అకాడమీ ఉత్తమ అవార్డును గెలుచుకుంది.

Bodike Manohar, Malkajgiri
Published on: 26 Aug 2026 5:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఉత్తమ కూచిపూడి అకాడమీగా మల్కాజిగిరి ‘భావనలయ’కు జాతీయ అవార్డు!

Malkajgiri: నాగపూర్‌లో శ్రీకృష్ణ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుంచి 23 వరకు నిర్వహించిన అఖిల భారత నృత్య, సంగీత పోటీల్లో మల్కాజిగిరికి చెందిన భావనలయ నృత్య అకాడమీ విద్యార్థులు ప్రతిభ చాటారు. అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, నృత్యాచార్యులు డా. వట్టికోట యాదగిరాచార్యుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది కూచిపూడి విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 22 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి విజయాలు సాధించారు.

పోటీల్లో భావనలయ నృత్య అకాడమీకి ఉత్తమ నృత్య అకాడమీ అవార్డు లభించగా, ఉత్తమ నృత్య ప్రదర్శనకు దేవహర్ష అవార్డును అందుకున్నారు. భావనలయ నృత్య అకాడమీ గత 35 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు పొందుతోందని డా. వట్టికోట యాదగిరాచార్యులు తెలిపారు.

విద్యార్థులు పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించే దిశగా అకాడమీని ముందుకు తీసుకెళ్తామని డా. వట్టికోట యాదగిరాచార్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story