Rayadurgam: ఖజాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం పశ్చిమ బెంగాల్ యువకుడు మృతి

Rayadurgam: రాయదుర్గం పీఎస్ పరిధిలోని ఖజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ సమీపంలో ఘోర బైక్ ప్రమాదం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 22 Aug 2026 9:16 AM IST
Rayadurgam
X

Rayadurgam: ఖజాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం పశ్చిమ బెంగాల్ యువకుడు మృతి

Rayadurgam: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన సహస్ర ఛటోపాధ్యాయ (25), అభిజిత్ సింగ్ (25), అబ్బాస్ సిద్దిక్ (25) అనే ముగ్గురు యువకులు బైక్‌పై (WB 26 BM 2608) ఖజాగూడ నుండి అంజయ్య నగర్ వైపు వెళ్తున్నారు. శనివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటల ప్రాంతంలో ESI 2వ గేట్ సమీపంలో కేర్ హాస్పిటల్ ప్రధాన రహదారి వైపు మలుపు తీసుకుంటుండగా, బైక్ తీవ్ర వేగంలో ఉండటంతో వాహనదారుడు నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యాడు.

ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న అబ్బాస్ సిద్దిక్ తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ నడుపుతున్న సహస్ర ఛటోపాధ్యాయ, మధ్యలో కూర్చున్న అభిజిత్ సింగ్‌లకు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం వెంటనే కేర్ హాస్పిటల్‌కు తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story