Uppal: ఎన్‌జీఆర్‌ఐ వద్ద చైన్, సెల్ ఫోన్ స్నాచింగ్!

Uppal: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌జీఆర్‌ఐ వద్ద తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న వ్యక్తి నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు 1.5 తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కెళ్లారు.

KARUNAKAR, UPPAL
Published on: 18 Nov 2026 11:07 AM IST
Uppal
X

Uppal: ఎన్‌జీఆర్‌ఐ వద్ద చైన్, సెల్ ఫోన్ స్నాచింగ్!

Uppal: ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్‌జీఆర్‌ఐ వద్ద బుధవారం తెల్లవారుజామున సెల్ ఫోన్ ,చైన్ స్నాచింగ్‌ జరిగింది. ఫోన్‌లో మాట్లాడుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి బంగారు గొలుసుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు.

వెలుగు గుట్ట, స్ట్రీట్‌ నంబర్‌ 8కు చెందిన మురళిబాబు (49) ఉదయం 5.40 గంటల సమయంలో ఎన్‌జీఆర్‌ఐ వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆయన మెడలోని 1.5 తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను దుండగులు అపహరించి తార్నాక వైపు వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL