Medchal: డబీల్‌పూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం!

Medchal: మేడ్చల్ మండలం డబీల్‌పూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన బైక్. హెల్మెట్ ధరించడంతో తృటిలో తప్పిన ప్రాణాపాయం. స్థానికుల స్పందన.

NAKSHATRAM, MEDCHAL
Published on: 25 Sept 2026 12:02 PM IST
Medchal
X

Medchal: డబీల్‌పూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం!

Medchal: డబీల్‌పూర్ చౌరస్తా సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్‌ను వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం డబీల్‌పూర్ చౌరస్తా వద్ద ఎన్ఎల్ 01 క్యూ 2839 రిజిస్ట్రేషన్ నంబర్ గల కంటైనర్ లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది.

అదే సమయంలో తూప్రాన్ వైపు నుంచి మేడ్చల్ వైపునకు టీఎస్ 35 హెచ్ 5428 నంబర్ గల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు అదుపుతప్పి ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక భాగంలో ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ ముందు భాగం దెబ్బతింది. సదరు యువకుడు హెల్మెట్ ధరించి ఉండటంతో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఒంటిపై బలమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ ధరించడం వల్లే యువకుడి ప్రాణాలు నిలిచాయని స్థానికులు పేర్కొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL