Shabad: నాగర్‌గూడ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం బైకిస్టుకు గాయాలు

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్‌గూడ చౌరస్తాలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

RAGHAVENDRA, CHEVELLA
Updated on: 11 Oct 2026 12:44 PM IST
Shabad
X

Shabad: నాగర్‌గూడ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం బైకిస్టుకు గాయాలు

Shabad: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని నాగర్‌గూడ గ్రామం వద్ద షాద్‌నగర్ డిపోకు చెందిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సు మరోసారి ప్రమాదానికి గురైంది. షాద్‌నగర్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న బస్సు నాగర్‌గూడ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తలకు గాయమైంది. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన మంత్రాల నరసింహులు నాగర్‌గూడలో కిరాణా సామగ్రి కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

నాలుగు రోజుల క్రితమే మరో ఘటన

నాలుగు రోజుల క్రితం షాబాద్ బస్టాండ్‌లో ఓ బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో బస్సులో నుంచి ఓ మహిళ కిందపడిన ఘటన చోటుచేసుకుందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఆ ఘటన మరువకముందే నాగర్‌గూడ చౌరస్తా వద్ద మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రయాణికులు, విద్యార్థుల ఇబ్బందులు

ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు నిర్లక్ష్యంగా, అధిక వేగంతో బస్సులు నడుపుతున్నారని, కొందరు సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బస్సులు ఎక్కడ ఆపుతున్నారు, ఎక్కడ ఆపడం లేదు, డ్రైవర్లు విధులకు హాజరయ్యే సమయంలో వారి పనితీరు ఎలా ఉంది అనే అంశాలపై డిపో అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని వారు కోరుతున్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA