Hyderabad: బిట్రాంజ్ 10 ఏళ్ల ప్రస్థానం.. ఏఐ వృద్ధిపై ఫోకస్

Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా బిట్రాంజ్ సంస్థ దశాబ్ది వేడుకలు. రెండో దశాబ్దంలో ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడి.

RAJESH,	WEST ZONE
Published on: 15 Aug 2026 10:23 PM IST
Hyderabad
X

Hyderabad: బిట్రాంజ్ 10 ఏళ్ల ప్రస్థానం.. ఏఐ వృద్ధిపై ఫోకస్

హైదరాబాద్: బిజినెస్ టెక్నాలజీ, ఈఆర్పీ సేవల సంస్థ బిట్రాంజ్ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సోమాజిగూడ పార్క్ హోటల్ లో ‘ఈఆర్పీ అమలులో ఏఐ పాత్ర’ అంశంపై ప్యానెల్ చర్చ నిర్వహించింది.

ఏఐ, క్లౌడ్, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్ రంగాల్లో మరింత విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. రెండో దశాబ్దంలో ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు బిట్రాంజ్ మేనేజింగ్ డైరెక్టర్ షేకర్ పాషా తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, టెక్నాలజీ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా ఎదగడమే లక్ష్యమన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story