Hyderabad: విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్!

Hyderabad: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన రెండు రోజుల నిరసన దీక్షలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 Aug 2026 5:04 PM IST
Hyderabad
X

Hyderabad: విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్!

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల నిరసన దీక్ష కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల్ శంకర్ గారు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి *ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.. కళాశాలలకు ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ శ్రేణులు వారి పక్షాన నిలబడి పోరాడుతాయి” అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు స్పష్టం చేశారు.

విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ చేపట్టిన ఈ పోరాటానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.* విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం చేపట్టే ప్రతి ఉద్యమంలో ఆదిలాబాద్ బీజేపీ శ్రేణులు ముందుండి పోరాడుతాయని పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story