Nacharam: నాచారంలో అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినతి

Nacharam: హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాచారం డివిజన్‌లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ బెల్ట్ షాపులపై బీజేపీ, బీజేవైఎం శ్రేణులు సమర శంఖం పూరించాయి.

HARISH, TARNAKA
Published on: 15 Jun 2026 6:38 PM IST
Nacharam
X

Nacharam: నాచారంలో అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినతి

Nacharam: నాచారం డివిజన్‌లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్న బెల్ట్ షాపుల పై బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు నాచారం ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

నాచారం డివిజన్‌లోని శ్రీనగర్ హనుమాన్ ఆలయం వెనుక భాగంలో, పాత వార్డు కార్యాలయం వెనుక భాగంలో, రాఘవేంద్ర నగర్‌లోని ఫుట్ స్టోర్ సమీపంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డివిజన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా చట్టవిరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ బెల్ట్ షాపుల కారణంగా యువత మత్తు పదార్థాలకు బానిసలవుతూ, మహిళలు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత మరియు సామాజిక శాంతి భద్రతల దృష్ట్యా వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అక్రమ బెల్ట్ షాపులను మూసివేయాలని కోరారు. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సమస్యలపై స్పందించి అక్రమ బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకుడు అల్లగోని అభిషేక్ గౌడ్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవీన్ కుమార్, బీజేపీ నాయకులు రాగిరి మోహన్ రెడ్డి, మల్కా ప్రకాష్, ఆర్.కె. నాయుడు, పదం వెంకటేష్, ఉదయ్ కిరణ్ రెడ్డి, గంగిచెట్టి నవీన్ గౌడ్, అర్కాల సాయి గౌడ్, ఒరుగంటి వెంకటేష్, కిషోర్, నడిగోటు బాలకృష్ణ, ఆర్. నవీన్ కుమార్, కందారి భాస్కర్, పిట్లం బాలకృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story