Keerthi Reddy: హౌజ్ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోం: బీజేపీ!
Keerthi Reddy: బీజేపీ నేతల హౌజ్ అరెస్టులపై పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు జూటూరి కీర్తి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు.
Keerthi Reddy: హౌజ్ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోం: బీజేపీ!
Keerthi Reddy: విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసనలు చేస్తామంటే మీకు ఎందుకంత భయం, కాంగ్రెస్ పాలనపై ప్రజలకే కాదు.. మీ సొంతపార్టీ నేతలకు కూడా నమ్మకం పోయింది, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌజ్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కేయాలనుకోవడం సబబు కాదు, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?
మీకేమో.. అమెరికాలో దేశ విద్రోహ శక్తులను కలిసేందుకు అనుమతులు ఇవ్వాలంటారు. కానీ మాకు సొంత రాష్ట్రంలో పిలల్ల నిరసనలకు మద్దతిస్తామంటే అడ్డుకుంటారా. దెక్కడి ప్రజాపాలన, అసలు ఈ రాష్ట్రంలోప్రజాస్వామ్యం ఉందా. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతిస్తాంటే.. హౌజ్ అరెస్ట్ అంటారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం దీక్ష చేస్తామంటే అనుమతులివ్వరు. ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
విద్యాశాఖ మంత్రిగా.. తనశాఖ నిర్వహణ చేతగాక ప్రశ్నిస్తే అరెస్ట్ చేయిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే హిట్లర్ లా వ్యవహరిస్తున్నారు. నిరసన తెలిపే విద్యార్థులపై లాఠీఛార్జీలు, ప్రతిపక్ష నేతల హౌజ్ అరెస్ట్ లు చూస్తుంటే.. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది.
మీకూ కేసీఆర్ గతే..
గతంలో ప్రతిపక్షాలను అణగదొక్కిన వాళ్లు ఇప్పడు ఫాం హౌజ్ లకు పోయిండ్రు, అదే బాటలో నడుస్తున్న రేవంత్ కూ అదే పరిస్థితి ఖాయం, బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మాపై అణచివేత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌజ్ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే, ఊరుకోం.




