Hyderabad: రక్త చరిత్ర సృష్టించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి!

Hyderabad: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

G. Govind, Medchal
Published on: 14 July 2026 1:12 PM IST
Hyderabad
X

Hyderabad: రక్త చరిత్ర సృష్టించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి!

Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు పార్టీలు కలిసి రక్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

రైతుల సమస్యలను పక్కనపెట్టి లోపాయికారీ ఒప్పందాలతో ఉమ్మడి డ్రామాలకు తెరలేపాయని మండిపడ్డారు. అమరవీరుల త్యాగాలను వృధా చేస్తూ, నిరుద్యోగులు, రైతులను ఇరుపార్టీలు మోసం చేస్తున్నాయంటూ గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనలకు మనం బలి కావద్దు. సీబీఐ కి మేడిగడ్డలో 9 వేల కోట్లు అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. అన్నారం,సుందిళ్ల గురుంచి ఇవ్వలేదు. అసలు కాళేశ్వరం ఊసే లేదు. రేవంత్ రెడ్డి తన మనవాడితో ఆడుకోవడంలో తప్పు లేదు.

నీళ్ల కోసం ఘోష పెడుతున్న రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. బీఆర్ఎస్ కి దమ్ము ఉంటే ఎటువంటి అవినీతి చేయకపోతే.. మేము అవినీతి చేస్తే నిరూపించాలని పోరాటం చేయండి.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story