Secunderabad: మన్నె క్రిశాంక్‌కు బీజేపీ నేత భానుక మల్లికార్జున్ స్ట్రాంగ్ వార్నింగ్!

Secunderabad: తన భవనంపై అక్రమ నిర్మాణమంటూ బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించిన బీజేపీ నేత భానుక మల్లికార్జున్.

Srikanth, Secunderabad
Published on: 4 July 2026 9:02 PM IST
Secunderabad
X

Secunderabad: మన్నె క్రిశాంక్‌కు బీజేపీ నేత భానుక మల్లికార్జున్ స్ట్రాంగ్ వార్నింగ్!

సికింద్రాబాద్: అప్ నాలెడ్జ్ తో సగం తెలిసి తెలియక కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ తమ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని,లేదంటే తగిన బుద్ధి చెబుతామని కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్ బీజేపీ నాయకుడు భానుక మల్లికార్జున్ హెచ్చరించారు.

నిన్న తాడ్ బంద్ సమీపంలో ఉన్న తన బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇది ఇల్లీగల్ కనిస్ట్రెక్షన్ అని దాని పై కంటోన్మెంట్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని,దానికి తన సతీమణి బానుక నర్మదా వెంటనే కంటోన్మెంట్ నామినేటెడ్ నెంబర్ కు రాజీనామ చేయాలని డిమాండ్ చేయడం అస్యాస్పదంగా ఉందని భానుక మల్లికార్జున్ అన్నారు.

తను కట్టిన బిల్డింగ్ ఇల్లిలీగల్ కాదని కంటోన్మెంట్ బోర్డు లో పర్మిషన్ లేకుండా కట్టిన తన కష్టార్జితం ఇల్లు అని,కాలి స్థలాన్ని కొని బిల్డింగ్ కట్టామని అందుకు కంటోన్మెంట్ బోర్డు నోటీసులు ఇచ్చిందని,దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళామని,సీబీఐ లో కేసు అయ్యిందని దానిలో క్లియరెన్స్ ఉందని,ప్రస్తుతం కోర్టు లో కొనగుతుందని ఆయన స్పష్టం చేసారు.

ఏదైనా రాజకీయం చేయడం తగదని,ఏదైనా ఎన్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఎవరో దొంగ ఇచ్చిన సగం సగం ఇన్ఫర్మేషన్ తీసుకొని పిచ్చి పిచ్చిగా క్రిశాంక్ మాట్లాడడం సరికాదని,అందుకు గాను లీగల్ నోటీసులు పంపిస్తామని భానుక మల్లికార్జున్ తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story