Hyderabad: ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి!

Hyderabad: హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో బీజేపీ నాయకురాలు జూటూరు కీర్తిరెడ్డి ముఖ్య అతిథులతో కలిసి పాల్గొని సందడి చేశారు.

G. Govind, Medchal
Published on: 11 Oct 2026 10:11 AM IST
Hyderabad
X

Hyderabad: ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి!

Hyderabad: హైదరాబాద్ ధర్నా చౌక్ లో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధూమ్ ధామ్ గా బతుకమ్మ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ సతీమణి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య రెడ్డి, BJLP లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సతీమణి కవితారెడ్డితో కలిసి వేడుకల్లో పాల్గొన్న కీర్తి రెడ్డి.

వేడుకల్లో భాగంగా ముఖ్య అతితులను ఘనంగా సన్మానించిన బండారు దాత్తాత్రేయ, విజయ లక్ష్మిగారు. స్పెషల్ ఎట్రాక్షన్ గా డీజేపాటలు.. బతుకమ్మ ఆటలు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆహ్వానితులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కీర్తి రెడ్డి.

డీజే పాటకు లయ బద్దంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడిన తీరు వేడుకల్లో హైలెట్ గా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ, నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రకృతి పూలు, పసుపు కుంకుమలనే గౌరమ్మ ( దేవత)గా కొలిచి మెక్కే అరుదైన కల్చర్, ఆ గౌరమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి, తెలంగాణ ఆడపడుచులందరికి పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

G. Govind, Medchal

G. Govind, Medchal