Shabad: తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది: బీజేపీ మండల అధ్యక్షుడు మనెయ్య

Shabad: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు మనెయ్య ఆరోపించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 6 Sept 2026 3:22 PM IST
Shabad
X

Shabad: తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది: బీజేపీ మండల అధ్యక్షుడు మనెయ్య

Shabad: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిరంకుశ పాలన కొనసాగిస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు మనెయ్య ఆరోపించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ర్యాలీగా వెళ్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందూ వ్యతిరేక ధోరణిని వీడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

హిందువులు పండుగలు నిర్వహించుకునేందుకు అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనను ఎలా అంతం చేసి తెలంగాణకు విమోచనం కల్పించామో, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు మహేందర్, గూడెం రమేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు లింగాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story