Hyderabad: బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శలు!
Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు.
Hyderabad: బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శలు!
Hyderabad: బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఎన్నికల సంఘంకు వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతలు రోడ్లపై పడుకొని నిరసన తెలుపుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. అగ్రనాయకుడుగా ఎదగాలని రాహుల్ గాంధీ విచిత్రమైన చేష్టలు చేస్తున్నారు. గాంధీ కుటుంబం వారి ఉనుకు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి నీతులు చెపుతున్నారు..దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది రేవంత్ రెడ్డి మాటలు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు కదా. రేవంత్ రెడ్డి ని సీఎం పదవి చోరీ కాబోతుంది. ని సీఎం సీట్ చోరీ చేసేందుకు ఖమ్మం, నల్గొండ బ్యాచ్ రెడీ గా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలకి ఇచ్చినహామీల గురుంచి మాట్లాడండి రేవంత్ రెడ్డి.
70 సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి ఎం తీసుకొచ్చారు. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం బాగుంది..ఓడితే ప్రధాని మోదీ కారణం అంటారు. రాహుల్ గాంధీ ఫెయిల్యూర్. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కెసిఆర్ కుటుంబం చేసిన అవినీతి పై…విచారణ చేసి జైల్లో పెడతామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో 20 స్క్యాం లు వరకు జరిగాయి..వాటిపై విచారణ ఏది. కెసిఆర్ పామ్ హౌస్ నుండి రేవంత్ రెడ్డి కి ఫోన్ రాగానే సైలెంట్ అయిపోతారు. ప్రజలకు అండగా మా అధ్యక్షుడు పోరాటం చేస్తుంటే ఒక నెలలో ఆరు సార్లు అరెస్ట్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఒకసారి అవకాశం ఇస్తే ఎప్పడు అధికారంలో ఉంటుంది.
ఏ ఎన్నికలు వచ్చిన బీజేపీ కి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గాంధీ నిన్న మహిళా కానిస్టేబుల్ పట్ల ప్రవర్తించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగ పదవుల్లో ఉండి మంత్రులు ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం. ధర్నాల చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ఇండీ కూటమి నేతలకి అర్థమైంది. ప్రజా తీర్పును హిందువుగా స్వీకరించలేక ఇలాంటి నిరసనలు చేస్తున్నారు. ఇండీ కూటమి నేతలకు ఎలక్షన్ కమిషన్ ని కలిసే ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండని ఎలక్షన్ కమిషన్ చెప్పిన రాహుల్ గాంధీ ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కొంత మంది 2014 నుండి కలలు కంటున్నారు. మాకు కొన్ని రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు రాకపోయినా మేము ప్రజల తీర్పును గౌరవించాం.
మేము ప్రజలని ఎప్పడు నిందించలేదు. 13 కోట్ల మంది ప్రజల ఓటర్లను తీసేశారని..తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డబుల్ ఓట్లు, దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లని ఎలక్షన్ కమిషన్ తొలగించింది. అక్రమైన ఓట్లని సక్రమైనవిగా ఎలక్షన్ కమిషన్ చేయాలా చెప్పండి. SIR మోదీ తీసుకురాలేదు.




