Hyderabad: అంజయ్య నగర్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం!

Hyderabad: శేరిలింగంపల్లి అంజయ్య నగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 17 Sept 2026 5:10 PM IST
Hyderabad
X

Hyderabad: అంజయ్య నగర్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం!

హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్ర్యం కోసం, స్వతంత్ర భారత్‌లో నిజాం సంస్థాన విలీనం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్య నగర్ డివిజన్‌లో నిర్వహించిన 'తెలంగాణ విమోచన దినోత్సవ' వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను, వారి అమరత్వ స్ఫూర్తిని కొనియాడారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ద్వారా నిజాం మెడలు వంచి, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ మహత్తర విజయానికి ప్రతీకగానే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు సాగర్, సీనియర్ నాయకులు వినయ్, ఓబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సరోజ, ఆమని, కిషన్ సింగ్, ఆత్మారామ్, ముకేష్‌లతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY