Vanipalli Srinivas Reddy: ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

Vanipalli Srinivas Reddy: ప్రకాష్ రాజ్ ను ఎవరైనా చంపితే బాధ్యత నాదేనని బీజేపీ నేత వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 22 April 2026 5:27 PM IST
Vanipalli Srinivas Reddy
X

Vanipalli Srinivas Reddy: ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

Vanipalli Srinivas Reddy: సినీ నటుడు ప్రకాష్ రాజును ఎవరైనా చంపితే బాధ్యత నేను తీసుకుంటా.. రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని ఊరికించి కొడతామని రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడు,లక్ష్మణుడు పై వ్యంగ్యంగా మాట్లాడిన వ్యాఖ్యల పై కర్మన్ ఘాట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాష్ రాజ్ ను అన్ని సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ పై తీవ్రమైన పదజాలం తో శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ప్రకాష్ రాజును ఎవరైనా చంపితే అందుకు తాను బాధ్యత వహిస్తాను అంటూ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం పై ఇక పై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన సహించేది లేదని ప్రకాష్ రాజు కు సంబంధించి ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వచ్చి కొడుతామంటూ హెచ్చరించారు. సినీ అగ్ర హీరోలు,నిర్మాతలు ప్రకాష్ రాజు బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నాస్తికుడు అనే ముసుగులో హిందూ ధర్మం పై దాడి చేస్తున్నాడని ఇలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story