Serilingampally: రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటోలు పెట్టాలి: బీజేపీ డిమాండ్!
Serilingampally: శేరిలింగంపల్లి పరిధిలోని అంజయ్య నగర్, బంజారా బస్తీలలో బీజేపీ ఆధ్వర్యంలో బస్తీ-బాట కార్యక్రమం నిర్వహించారు.
Serilingampally: రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటోలు పెట్టాలి: బీజేపీ డిమాండ్!
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ లోని ప్రజల సమస్యలను మా భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తల దృష్టికి తీసుకువస్తే ప్రజల తరపున ప్రజా గొంతుకై ప్రభుత్వాన్ని , ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ ,మీ సమస్యల పరిష్కారం కోసం మేము చేసే పోరాటానికి సిద్ధం అనే నినాదంతో బస్తీ బాట కార్యక్రమానికి పిలుపునిస్తూ ఈరోజు అంజయ్య నగర్ డివిజన్ లోని ప్రజల విజ్ఞప్తి మేరకు అంజయ్య నగర్ , బంజారా బస్తీ లలో సమస్యలపై పర్యటించిన ...బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, ముఖ్యఅతిథిగా పాల్గొన్న చేవెళ్ల మాజీ శాసన సభ్యులు రత్నం.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా 7,8 అంతస్తుల భవన నిర్మాణాలు, రోజు పొంగుతున్న డ్రైనేజీ, పాడైపోయిన రోడ్ లు ఇలా పలు సమస్యల తో అంజయ్య నగర్ , బంజారా బస్తీ వాసులు సావాసం చేస్తున్నారన్నారు, మా దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
అలాగే రేషన్ షాపులను కూడా పరిశీలించడం జరిగిందని రేషన్ బియ్యం 6 కిలోలు ఇస్తుంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లు బాకాలు కొట్టుకుంటున్నారని, అందులో కేంద్రమే 5 కిలోలు ఉచితంగా ఇస్తుంది అని, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇస్తుందని ప్రజలు క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు, అలాగే 5 కిలోలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వానిది కాని, మోదీ గారిది గానీ ఒక్క ఫోటో కూడా లేకపోవడం బాధాకరమన్నారు, రేషన్ కార్డుల పై ముఖ్యమంత్రి , మంత్రుల ఫోటోలు వేసుకుని మోడీ గారి ఫోటో వేయకపోవడం సరైన పద్ధతి కాదన్నారు, అందుకోసమే అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ రేషన్ షాప్ ల వద్ద మోడీ గారి ఫొటోతో పాటు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు తెలియచేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలపడం జరిగిందని.
ఈరోజు నుండి ప్రతి డివిజన్ బస్తీ,కాలనీ లలోని రేషన్ షాప్ ల వద్ద మోడీ ఫోటో లతో పాటు కేంద్ర వాటా గురించి తెలియచేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రవి నాయక్,జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు సాగర్, సంతోష్ కుమార్, మన్యం కొండ సాగర్, సరోజ రెడ్డి,ఆమని, సాగర్, వెంకటేష్, కిషన్, క్రాంతి,ధనరాజ్, మోహిత్ , శంకర్, సంజీవ్, చందు, మరియు ఇతర స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




