Hyderabad: ఖర్గే వ్యాఖ్యల సెగ.. నాచారం, తార్నాకలో బీజేపీ ఆందోళన!

Hyderabad: ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాచారం, తార్నాక ప్రాంతాల్లో మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు.

HARISH, TARNAKA
Published on: 22 April 2026 9:00 PM IST
Hyderabad
X

Hyderabad: ఖర్గే వ్యాఖ్యల సెగ.. నాచారం, తార్నాకలో బీజేపీ ఆందోళన!

Hyderabad: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ నాచారంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశ ప్రజల భావోద్వేగాలను దెబ్బ తీసే చర్య అన్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, దీనిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లెల నర్సింగ్ రావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రాగిరి మోహన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కాటిపల్లి రవీందర్ రెడ్డి, మల్కా ప్రకాష్, దయ గౌడ్, రవికాంత్, పాదం వెంకటేష్, ఉదయ్ కిరణ్ రెడ్డి, వెంకట్ నాయక్, అమర్, బాలు, వెంకటేష్, నాదం, కాంటెకర్ కిషోర్, భాస్కర్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story