Hyderabad: మోడీ 12 ఏళ్ల సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ
Hyderabad: ప్రధాని మోడీ 12 ఏళ్ల సుపరిపాలన విజయాలపై సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న భారీ సభకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Hyderabad: మోడీ 12 ఏళ్ల సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ
Hyderabad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల విశ్వసనీయ, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించిన మీడియా సమావేశం రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ పరిధిలో నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న సమావేశానికి సన్నాహకాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలలో సాధించిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, సుశాసనం మరియు దేశ ప్రగతికి సంబంధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని ఆయన తెలిపారు.
ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు బీజేపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ 12 సంవత్సరాల విజయాలను విస్తృతంగా ప్రజలకు తెలియజేయడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యమని ,ప్రతి నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు బీజేపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ ఇన్‌చార్జ్ సామ రంగ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బి. యశ్‌పాల్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవి రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్, బీజేపీ జిల్లా కార్యదర్శి నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




