Hyderabad: ప్రజాస్వామ్య పరిరక్షణకు నేడు బీజేపీ మహా పాదయాత్ర: లక్ష్మీకాంత్ రెడ్డి
Hyderabad: హైదరాబాద్లో నిజాం కాలేజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు అమిత్ షా పాల్గొనే బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని లక్ష్మీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Hyderabad: ప్రజాస్వామ్య పరిరక్షణకు నేడు బీజేపీ మహా పాదయాత్ర: లక్ష్మీకాంత్ రెడ్డి
Hyderabad: ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో సోమవారం హైదరాబాద్లో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు నిజాం కాలేజ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర మొజాంజాహీ మార్కెట్ ఎక్స్ రోడ్డు వరకు కొనసాగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఎన్నికల సంఘం ప్రతిష్ఠను కాపాడటంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించనున్నట్లు వెల్లడించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.




