Hyderabad: బీజేపీ కార్యాలయంలో ‘మన బాలశిక్ష’ పుస్తకావిష్కరణ!

Hyderabad: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాండురంగారావు రచించిన ‘మన బాలశిక్ష’ పుస్తకావిష్కరణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బండారు దత్తాత్రేయ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

G. Govind, Medchal
Published on: 12 Aug 2026 8:05 PM IST
Hyderabad
X

Hyderabad: బీజేపీ కార్యాలయంలో ‘మన బాలశిక్ష’ పుస్తకావిష్కరణ!

హైదరాబాద్: మన బాలశిక్ష’ పుస్తకం భారతీయ సంస్కృతి, నైతిక విలువలకు ప్రతీక భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞాన సంపద, నైతిక విలువలను పిల్లలకు పరిచయం చేసేలా ‘మన బాలశిక్ష’ రూపకల్పన చేశారు.

చిన్ననాటి నుంచే పిల్లల్లో మంచి ఆలోచనలు, మంచి నడవడి, నైతిక విలువలు పెంపొందించాలి, పిల్లలను కేవలం విద్యావంతులుగా కాకుండా నైతిక విలువలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. నైతిక విలువల పునాదిపై సమాజం నిలబడితే దేశం మరింత బలంగా అభివృద్ధి చెందుతుందది, భారతదేశ వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని గౌరవించుకోవడం మన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నశా ముక్త్ భారత్’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాండురంగారావు కృషి చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ దేశం పట్ల బాధ్యతను గుర్తించుకోవాలి, జాతీయ పతాకంలోని అశోక చక్రం ధర్మం, న్యాయం, సత్యానికి ప్రతీక

దేశం పట్ల బాధ్యత, సంస్కృతి పట్ల గౌరవం, భారతీయత పట్ల గర్వం, సమాజం పట్ల బాధ్యతే మన ధర్మంలో భాగం, పిల్లల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సంస్కృతి, నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించాలి ‘మన బాలశిక్ష’ వంటి రచనలు మరిన్ని రావాలి.. బలమైన సమాజం, బలమైన దేశం నిర్మాణానికి ఇవి దోహదపడతాయి.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story