Hafeezpet: హఫీజ్‌పేట్‌లో 'బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్'.. విద్యార్థులకు పోటీలు!
Hafeezpet: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
Hafeezpet: హఫీజ్‌పేట్‌లో 'బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్'.. విద్యార్థులకు పోటీలు!
హఫీజ్ పేట్: భారతదేశ విద్యార్థులు, యువత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి మాణిక్ రావు పిలుపునిచ్చారు.
'బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ - 2026'లో భాగంగా, ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 వసంతాల ప్రజా సేవను పురస్కరించుకొని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. హఫీజ్ పేట్ అంబేద్కర్ నగర్‌లోని ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు *"నా కలలోని భారత్"* అనే అంశంపై చిత్రలేఖనం మరియు వ్యాసరచన (Essay Writing) పోటీలు చేపట్టారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు, పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపెంట్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి మాణిక్ రావు మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తమ జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని కొనియాడారు. స్వయంసేవక్‌గా, బీజేపీ నాయకుడిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా నిత్యం ప్రజా శ్రేయస్సు కోసమే మోదీ గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు విజేందర్ సింగ్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆళ్ల వరప్రసాద్, పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, నాయకులు అఖిల్ యాదవ్, రాజశేఖర్, కిరణ్ కుమార్, నరేష్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




