Uppal: దేవుళ్లపై రాజకీయాలా? ఉప్పల్‌లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!

Uppal: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉప్పల్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు.

KARUNAKAR, UPPAL
Published on: 29 Sept 2026 5:52 PM IST
Uppal
X

Uppal: దేవుళ్లపై రాజకీయాలా? ఉప్పల్‌లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ!

Uppal: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఉప్పల్‌ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. బీజేపీ ఉప్పల్‌ డివిజన్‌ అధ్యక్షుడు మర్నేని ఫణింద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్‌, బీజేవైఎం మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ‘‘శివుడు పేదల దేవుడు.. రాముడు సంపన్నుల దేవుడు’’ అంటూ వ్యాఖ్యానించడంతో పాటు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను ఆర్య–ద్రావిడ విభజనతో ముడిపెట్టి మాట్లాడారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు.

శ్రీరాముడు, పరమశివుడు హిందూ సమాజం మొత్తం ఆరాధించే దైవాలని, వారిని పేద–ధనిక వర్గాలుగా విభజిస్తూ మాట్లాడటం సరికాదని అన్నారు. హిందూ సమాజాన్ని విభజించేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరారు.

కార్యక్రమంలో బీజేపీ ఉప్పల్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి నామ శ్రవణ్‌, బీజేవైఎం ఉప్పల్‌ అధ్యక్షుడు ఆడెపు రమేష్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అభిషేక్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు గడ్డం సాయికిరణ్‌, బీజేవైఎం నాయకులు ఆకుల రిషికేష్‌, అభిరామ్‌రెడ్డి, సాయివెంకట్‌ ముదిరాజ్‌, మనోహర్‌, రాహుల్‌, రాజు, చింటూ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL