Kothapet: కొత్తపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్!

Kothapet: పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బీజేపీ ఎల్బీనగర్ ఇంచార్జ్ సామా రంగారెడ్డి పాల్గొని బాలికలకు అవగాహన కల్పించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 July 2026 3:20 PM IST
Kothapet
X

Kothapet: కొత్తపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్!

కొత్తపేట: "తల్లి ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కోగలదు" అనే భావనతో మహిళల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన HPV - Human Papillomavirus వ్యాక్సినేషన్ కార్యక్రమం కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించబడింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 14 ఏళ్లు నిండిన బాలికలకు ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రాల్లో HPV వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తున్నారు.

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బీజేపీ ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ & మేడ్చల్ రూరల్ జిల్లా ప్రభారీ శ్రీ సామా రంగారెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సామా రంగారెడ్డి గారు మాట్లాడుతూ, మహిళల భవిష్యత్ ఆరోగ్య రక్షణకు HPV వ్యాక్సిన్ ఎంతో కీలకమని, అర్హులైన బాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమానికి అమలు చేస్తున్న ఇలాంటి పథకాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ నాయికోటి పవన్ కుమార్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీ మంచి రాజేష్ గారు, శ్రీ సుందర్ నారాయణ గారు, శ్రీ ఎలిమినేటి జంగా రెడ్డి గారు తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story