Hyderabad: కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి రాష్ట్ర అధ్యక్షుడు

Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ ఎస్సీ మోర్చా కీలక సమావేశం జరిగింది.

G. Govind, Medchal
Published on: 15 July 2026 11:42 PM IST
Hyderabad
X

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చ సమావేశం.ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు .రాంచందర్ రావు.కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు తగిన గౌరవం ఇవ్వలేదు,నిజమైన గుర్తింపు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది.

అంబేద్కర్‌కు సంబంధించిన పంచతీర్థాలను అభివృద్ధి చేసి, లండన్‌లోని ఆయన నివాసాన్ని పరిశోధనా కేంద్రంగా మార్చింది బీజేపీనే.దళితుల సంక్షేమం, సాధికారత కోసం అత్యధిక అవకాశాలు కల్పించిన పార్టీ బీజేపీయే, రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ దళితులకు కూడా పూర్తి రిజర్వేషన్ ప్రయోజనాలు అందాయి,రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల్లో సామాజిక న్యాయానికి బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి మూసీ బాధితులకు సరైన పునరావాసం కల్పించడం లేదు.రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రిజర్వేషన్ల అంశంపై సమగ్ర చర్చ జరగాలి.

ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలి,కేంద్ర ప్రభుత్వ దళిత సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగేలా నేతలు కార్యకర్తలు పనిచేయాలి.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story