Hyderabad: మేయర్ పీఠమే లక్ష్యంగా పనిచేయాలి.. రాంచందర్ రావు పిలుపు!
Hyderabad: బీజేపీ సమావేశంలో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు
Hyderabad: మేయర్ పీఠమే లక్ష్యంగా పనిచేయాలి.. రాంచందర్ రావు పిలుపు!
హైదరాబాద్: రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యం గెలుపే ఏకైక లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పిలుపు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని తెలిపారు.రంగారెడ్డి జిల్లా (అర్బన్) కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.జిల్లా కార్యవర్గ సమావేశాలు సంస్థాగత బలోపేతంతో పాటు రాజకీయ వ్యూహాలకు వేదిక అని చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి బలమైన క్యాడర్, ప్రజల ఆదరణ ఉందని అన్నారు.గత విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ఈసారి హైదరాబాద్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
పార్టీలో భేదాభిప్రాయాలు సహజమే అయినా క్రమశిక్షణతో ముందుకు సాగాలని అన్నారు.వ్యక్తిగత ఆశల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు అవకాశాలు ఉంటాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై ఉద్యమాలు చేపట్టాలని సూచించారు.ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి ఇంటింటికీ వెళ్లాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓట్ల నమోదు, ప్రజలతో సత్సంబంధాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.




