Hyderabad: అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీలు ఏవి? అధ్యక్షుడు!
Hyderabad: ధర్నా చౌక్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మద్దతు తెలిపి, రూ. 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Hyderabad: అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీలు ఏవి? అధ్యక్షుడు!
హైదరాబాద్: ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కార్మికులకు పూర్తి సంఘీభావం ప్రకటించి వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువు కొనసాగేందుకు మధ్యాహ్న భోజన పథకం ఎంతో కీలకం రాష్ట్రంలోని 54 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్,కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం నెలకు ₹10,000 గౌరవ వేతనం ఇప్పటికీ అమలు కాలేదు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హామీ నెరవేర్చలేదు,నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా పాత రేట్ల ప్రకారమే నిధులు ఇస్తున్నారు.దీంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఇస్తున్న ₹3,000 వేతనం కూడా సకాలంలో చెల్లించడం లేదు,పెండింగ్‌లో ఉన్న బకాయిలతో పాటు ₹10,000 గౌరవ వేతనాన్ని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తరఫున లేఖ రాస్తానని హామీ
కార్మికులు అధైర్యపడవద్దని, వారి హక్కుల కోసం బీజేపీ అండగా ఉంటుందని భరోసా కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.




