Hyderabad: ఫీజు బకాయి – బీజేపీ లడాయి ఉద్యమం!
Hyderabad: తెలంగాణలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో 'ఫీజు బకాయి - బీజేపీ లడాయి' నిరసన.
Hyderabad: ఫీజు బకాయి – బీజేపీ లడాయి ఉద్యమం!
Hyderabad: ఫీజు బకాయి – బీజేపీ లడాయి
భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా BJYM చేపట్టిన “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాగదీప్ గౌడ్, రావుల పృధ్వి, శ్యామ్ కిరణ్, భరత్, శ్రీనాథ్, మంజునాథ్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది.
ఫీజు బకాయిలు విడుదలయ్యే వరకు BJYM పోరాటం ఆగదు!




