Veldanda: మైసిగండి ఆలయంలో బీజేవైఎం నేత రామకృష్ణ జన్మదిన వేడుకలు!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన బీజేవైఎం జిల్లా నాయకుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు మైసిగండి మైసమ్మ దేవాలయంలో ఘనంగా జరిగాయి.
Veldanda: మైసిగండి ఆలయంలో బీజేవైఎం నేత రామకృష్ణ జన్మదిన వేడుకలు!
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పట్టణ కేంద్రానికి చెందిన బీజేవైఎం జిల్లా నాయకులు రామకృష్ణ జన్మదిన వేడుకలను మైసిగండి మైసమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మైసిగండి దేవాలయ ఆవరణంలో కందుకూరు మండలం చిప్పలపల్లి వార్డు మెంబర్ అంబటి మల్లేష్‌తో పాటు రామకృష్ణ స్నేహితులు కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి పరస్పరం కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




