Kushaiguda: జీహెచ్ఎంసి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన లక్ష్మణ్!
Kushaiguda: కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడలో మంత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చలికాలం దుప్పట్లను ఘనంగా పంపిణీ చేశారు.
Kushaiguda: జీహెచ్ఎంసి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన లక్ష్మణ్!
Kushaiguda: తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబగళ్లు పారిశుద్ధత కోసం పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాలను నిలబెడుతున్న పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి అని కుషాయిగూడ నిర్మల వెంకన్న పేర్కొన్నారు.
కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ బస్టాండ్ లో పలు ఆలయాల నిర్మాణ కర్త, లయన్స్ క్లబ్ సభ్యులు మంత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ మున్సిపల్ కార్మికులకు ఏర్పాటుచేసిన చలి కాలపు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయనతోపాటు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 సి జోన్ చైర్ పర్సన్ లయన్ వడ్లోజు జ్యోతిర్మయా చారి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కు ఆరోగ్యాన్ని అందించే క్రమంలో అఘోరాత్రులు రోడ్లను వీధులను కాలనీలను శుభ్రం చేస్తూ తమ ఆరోగ్యాలను సైతం ఫణంగా పెడుతున్న పారిశుద్ధ కార్మికులను పారిశుద్ధ వైద్యులు అని పిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
పేదల ఆకలి తీర్చడానికి పేదలకు ఆర్థిక సామాజిక సహాయాన్ని అందించడానికి కృషి చేస్తున్న సేవకులను అభినందించారు. ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేకుండా ఉన్న చదువుకు వెళ్లలేక మధ్యలోనే చదువులు మానేస్తున్న ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను గుర్తించి వారి ఉన్నత విద్యకు సహకరించాలని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 32సి జోన్ చైర్ పర్సన్ లయన్ జ్యోతిర్మయాచారి ఈ సందర్భంగా సూచించారు.
పారిశుద్ధ వైద్యులకు తాము అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో అనేక ఆలయాలను నిర్మించడంతోపాటు నిరుపేదలైన వారికి ఉచిత వివాహాలు చేయడానికి, నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాలకు , దుప్పట్లు, చీరలుపంపిణీ కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నామని కార్యక్రమాన్ని నిర్వాహకులు లయన్ మంత్రి లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ గ్రీన్ సిటీ అధ్యక్షులు లయన్ కలకొండ బిక్షపతి, జిల్లా క్యాబినెట్ కోఆర్డినేటర్ లయన్ మహంకాళి నరసింహ చారి, ప్రభాకర్, ఎస్ ఎఫ్ ఏ లు లక్ష్మి, అంజలి తదితరులు పాల్గొన్నారు.




