Meerpet: మీర్‌పేట్‌లో ఎల్‌నినో ప్రభావంపై BMY ట్రస్ట్ భారీ ర్యాలీ!
Meerpet: బడంగ్‌పేట్ పరిధిలోని మీర్‌పేట్‌లో BMY ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
Meerpet: మీర్‌పేట్‌లో ఎల్‌నినో ప్రభావంపై BMY ట్రస్ట్ భారీ ర్యాలీ!
Meerpet: జిహెచ్ఎంసీ బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని మీర్‌పేట్ డివిజన్‌లో BMY ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే కరువు పరిస్థితులు, నీటి కొరతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు.
BMY ట్రస్ట్ వ్యవస్థాపకులు బాచనమోని ముఖేష్ యాదవ్ ముఖేష్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని మీర్ పేట్ , జిల్లెలగూడ కాలనీల్లో ఫ్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు నీటి సంరక్షణ, కరువు నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. దీని ప్రభావంతో భారతదేశంలో రుతుపవనాల వర్షాలు తగ్గి, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
సమాజం ఎదుర్కొనే సమస్యలపై ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,శుక్ర, శనివారాల్లో ఆయా కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేసి ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించామని తెలిపారు
BMY ట్రస్ట్ కేవలం ఒక సంస్థగా కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే వేదికగా పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బద్దుల రాజు యాదవ్, వేముల వంశీ గౌడ్, షేక్ ఫరూక్, కొరిగంజ శేఖర్, బిల్ మల్లికార్జున్ యాదవ్, బిల్ శివ తదితరులు పాల్గొన్నారు.




