Boduppal: బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Boduppal: బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీ పార్కులో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఆర్మీ అసోసియేట్ డైరెక్టర్ గోవింద్. పాల్గొన్న స్థానికులు.
Boduppal: బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
బోడుప్పల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ పార్కులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
మాజీ ఆర్మీ అసోసియేట్ డైరెక్టర్ గోవింద్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కాలనీ అభివృద్ధి, సంక్షేమం కోసం వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి నవీన్‌రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
కార్యక్రమంలో కాలనీ ముఖ్య సభ్యులు అమరలింగారెడ్డి, రాజాగౌడ్, వీరేశం, ఇతర ప్రముఖులు, పెద్దలు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో పార్కు పరిసరాలు మారుమోగాయి. అనంతరం చిన్నారులు, కాలనీవాసులకు స్వీట్లు పంపిణీ చేశారు.




