Boduppal: సాయిరాం నగర్‌లో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం!
Boduppal: బోడుప్పల్ సాయిరాం నగర్‌లో రూ.3.45 కోట్లతో చేపట్టిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు.
Boduppal: సాయిరాం నగర్‌లో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం!
Boduppal: బోడుప్పల్ సాయిరాం నగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న వర్షపు నీరు, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్‌లో రూ.3.45 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఈ పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు. కాలనీలో వర్షపు నీరు నిలిచిపోకుండా, మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అజయ్ యాదవ్ సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
బాక్స్ డ్రెయిన్ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్, సీనియర్ నాయకులు పోగుల నర్సింహారెడ్డి, కొత్త కిషోర్, సుమన్ భూఖ్యా, తోటకూర శ్రీశైలం యాదవ్, గుర్రాల వెంకటేష్, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, చిప్పల శ్రీను, కాలనీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డితో పాటు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.




