Boduppal: రూ. 6 కోట్లతో అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు.. సీఎం రేవంత్ రెడ్డికి తోటకూర అజయ్ యాదవ్ కృతజ్ఞతలు!
Boduppal: బోడుప్పల్ సర్కిల్‌లో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
Boduppal: రూ. 6 కోట్లతో అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు.. సీఎం రేవంత్ రెడ్డికి తోటకూర అజయ్ యాదవ్ కృతజ్ఞతలు!
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ లో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేయడంపై మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం యువతను శక్తివంతం చేయడంతో పాటు క్రీడలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు, అలాగే తోటకూర వజ్రేష్ యాదవ్ చేసిన కృషి, సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి చొరవ వల్లే బోడుప్పల్ ప్రాంతానికి ఈ కీలక ప్రాజెక్టు మంజూరైందన్నారు. నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆధునిక క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రానుండటంతో స్థానిక యువతకు తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు మరింత విస్తరించనున్నాయని అజయ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు బోడుప్పల్‌ను క్రీడా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.




