Boduppal: బోడుప్పల్లో ఘనంగా యాదవుల శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం!
Boduppal: బోడుప్పల్లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
Boduppal: బోడుప్పల్లో ఘనంగా యాదవుల శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం!
బోడుప్పల్: యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటుతూ బోడుప్పల్లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తొలుత వారు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు, పెద్దలు, యువకులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన సదర్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్, అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాలు యాదవుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, సంఘం పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.




