Nacharam: రహేజా విస్తా అపార్ట్‌మెంట్‌లో ఘనంగా బోనాల సంబరాలు!
Nacharam: నాచారం రహేజా విస్తా అపార్ట్‌మెంట్‌లో ఘనంగా బోనాల సంబరాలు. పూజల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్.
Nacharam: రహేజా విస్తా అపార్ట్‌మెంట్‌లో ఘనంగా బోనాల సంబరాలు!
Nacharam: హెచ్ఎంటి నగర్ డివిజన్‌లోని రహేజా విస్తా అపార్ట్మెంట్స్‌లో బోనాల పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించి, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అపార్ట్మెంట్ వాసులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బోనాల పండుగ సందర్భంగా అపార్ట్మెంట్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు, రహేజా విస్తా అపార్ట్మెంట్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో అపార్ట్మెంట్ వాసులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.




