Tandur: గురుకుల్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల సందడి!

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు.

Srikanth Reddy, Tandur
Published on: 8 Aug 2026 12:01 AM IST
Tandur
X

Tandur: గురుకుల్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల సందడి!

తాండూరు: తాండూరు పట్టణ కేంద్రంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలలో శుక్రవారం బోనాల సందడి నెలకొంది. చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి నెత్తిన బోనాలు పెట్టుకుని పాఠశాలకు వచ్చారు.

పోతరాజు వేషాలతో డోలు వాయిద్యాలతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాలరవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాసం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే పవిత్రమైన మాసం అన్నారు.

ఈ మాసంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవడం వస్తుందని అన్నారు. మహిళలు కొత్త కుండలో అన్నం పాలు బెల్లంతో నైవేద్యం తయారుచేసి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత అని అన్నారు. డప్పుల మూతలు, పోతరాజుల నృత్యాలు అమ్మవారి ఊరేగింపులు బోనాల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ పండుగ భక్తే సాంప్రదాయం సంస్కృతి ఐక్యతలకు ప్రత్యేకగా నిలుస్తుందని అన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story