Kadthal: కడ్తాల్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన లక్ష్మీ నరసింహ రెడ్డి

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ఆలయాల్లో బీఆర్ఎస్ నేత లక్ష్మీనరసింహారెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Sept 2026 4:25 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన లక్ష్మీ నరసింహ రెడ్డి

Kadthal: కడ్తాల్ పట్టణంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహా రెడ్డి తెలిపారు. ఆదివారం రోజున అపర్ణ పెద్దమ్మ, ఈదమ్మ మాందాత, బీరప్ప కామరాతి దేవాలయాల్లో స్థానిక నేతలు మరియు గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం నుండి దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల కోలాహలంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కడ్తాల్ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల పరమేష్,మాజీ ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, అన్మాసపల్లి ఉపసర్పంచ్ మహేష్ యాదవ్, వార్డు సభ్యులు మాదారం గణేష్ గౌడ్,ఎర్రోళ్ల రాఘవేందర్,దేవలా నాయక్, యాట నర్సింహా, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, బీచ్యా నాయక్,బాలరాజు, కుల పెద్దలు మూడ బాలయ్య, కేశని యాదయ్య,బొల్లా సత్యనారాయణ, చెన్నమోని శేఖర్,కటికపల్లి రమేష్, రేపని యాదయ్య, వరకుప్పల వెంకటేష్, బోసు వెంకటేష్, సత్యం, నరసింహ, పాండు, రాజు, శ్రీశైలం, మహేష్, కుర్మ సంఘం కుల పెద్దలు యాదయ్య, కృష్ణయ్య, చేగూరి రాములు,సూద శ్రీను, బండ శ్రీను,జల్కమ్ నాగార్జున,జల్కమ్ రమేష్,పిప్పల్ల యాదయ్య వివిధ కుల సంఘాల పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story