Kadthal: రావిచేడ్‌లో వైభవంగా బీరప్ప మహంకాళి బోనాలు – పాల్గొన్న సర్పంచ్!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప మహంకాళి బోనాలు ఘనంగా జరిగాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Aug 2026 8:07 PM IST
Kadthal
X

Kadthal: రావిచేడ్‌లో వైభవంగా బీరప్ప మహంకాళి బోనాలు – పాల్గొన్న సర్పంచ్!

కడ్తాల్: గారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ పేర్కొన్నారు. ఆదివారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

పుష్కలంగా వర్షాలు కురవాలని పంటలు పాడిపంట చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య వార్డు సభ్యులు రవికుమార్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, నాయకులు బండ లింగం, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, వెంకటేష్, పరశురాం, రాములు, సాయికుమార్, మహేష్, తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story