Hyderabad: మానవతా మూర్తులు బోనం రాజుకు ప్రతిష్ఠాత్మక కోడి రామకృష్ణ అవార్డు!

Hyderabad: హైదరాబాద్‌ ప్రసాద్ లాబ్‌లో బోనం రాజుకు కోడి రామకృష్ణ స్మారక అవార్డు అందజేసిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.

PRABHU, RAZOLE
Published on: 25 July 2026 9:35 AM IST
Hyderabad
X

Hyderabad: మానవతా మూర్తులు బోనం రాజుకు ప్రతిష్ఠాత్మక కోడి రామకృష్ణ అవార్డు!

Hyderabad: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న మానవతా మూర్తులు సేవా సంస్థ అధ్యక్షుడు బోనం రాజుకు ప్రతిష్టాత్మక కోడి రామకృష్ణ స్మారక అవార్డు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ స్మారకార్థం, శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవం గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్, సినీ నటులు సుమన్ తల్వార్, బాబూమోహన్, దివ్యవాణి, అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్ దర్శకుడు వీరశంకర్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు కేఎస్ రామారావు, అశోక్ కుమార్, అంబికా కృష్ణ, దామోదర ప్రసాద్, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన బోనం రాజును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వివిధ సేవా సంస్థలు, దాతలను సమన్వయం చేస్తూ సమాజ సేవలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు.

అవార్డు స్వీకరించిన అనంతరం బోనం రాజు మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. అవార్డు కమిటీ ఫౌండర్ చైర్మన్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎంపిక కమిటీ సభ్యులు, తన సేవలను గుర్తించిన ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్, జర్నలిస్టులు, సేవా సంస్థలు, దాతలు మరియు మానవతా మూర్తులు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో బోనం రాజు బాల్య మిత్రుడు జానకిరామయ్య మాష్టారు దంపతులతో పాటు, సీనియర్ జర్నలిస్టు సూర్యప్రకాశ్, పిండి నాగ వెంకట సుబ్బారావు, అబ్బరాజు నాగరాజు, మంగళంపల్లి సుధాకర్, చీర్ల సత్యనారాయణ, కేసరి అంజి, చేగొండి సాయి, డి. శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story