Chintalbasti: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ!
Chintalbasti: మల్కాజిగిరి చింతల్‌బస్తీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
Chintalbasti: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ!
మల్కాజిగిరి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతల్‌బస్తీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల్‌బస్తీలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రవేశికను చదివి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజును ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని విలువలు, ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్దార్ పటేల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్, నర్సింగ్‌రావు, ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకుడు మనోహర్, లక్ష్మీ ఆనంద్, నర్సింగ్, ఇస్మాయిల్, రమేష్, లక్ష్మణరావు, శ్రీనివాస్ గౌడ్, రాములు, కే. శ్రీకాంత్, మేకల నర్సింగరావు, సల్ల శ్రీకాంత్, పుట్ట శ్రీనివాస్, జంగరాజు, ఉమాపతి, నక్క శ్రీకాంత్, మల్లేష్, గణేష్, ఉదయ్ బాబు, జగమహేష్, రాజు, వినయ్, శ్రీనివాస్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.




