Hayathnagar: ఆర్.ఓ ప్లాంట్ ప్రారంభించిన బూడిద రామ్ రెడ్డి!
Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్‌లో బిఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు.
Hayathnagar: ఆర్.ఓ ప్లాంట్ ప్రారంభించిన బూడిద రామ్ రెడ్డి!
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్ మండల్లో మజీద్‌పూర్ గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి నూతన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో డ్రగ్స్, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అదేవిధంగా మజీద్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామగ్రి, ఫ్యాన్లను పంపిణీ చేశారు. రాగన్నగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో మజీద్‌పూర్ సర్పంచ్ మేడిపల్లి ప్రియచంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వార్డు సభ్యులు గోపగోని శివకుమార్, దూసరి నవనీత గణేష్ గౌడ్, పాలపాటి నర్సింహా, నంజుటి లావణ్య శ్రీనివాస్ గౌడ్, ఎల్కరాజు రఘు, నర్సింగ్ అనూష నాగరాజు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్, BRR ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




