Vikarabad: వికారాబాద్‌లో డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన ఘనంగా దీక్షా దివస్!

Vikarabad: వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన దీక్షా దివస్ ఘనంగా జరిగింది.

MOGULAIAH, VIKARABAD
Published on: 29 Nov 2026 12:03 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన ఘనంగా దీక్షా దివస్!

Vikarabad: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షను స్మరించుకున్న బీఆర్ఎస్ శ్రేణులువికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవీ త్యాగంతో ప్రారంభమై, ప్రాణత్యాగానికైనా సిద్ధమై కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి , అమరవీరులకు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వికారాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD