Hyderabad: టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలని బీఆర్ఎస్ డిమాండ్!

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పరీక్షల రోజునే టీజీపీఎస్సీ పరీక్షలు పెట్టడం అన్యాయం. ఏఈఈ పరీక్ష తేదీలను మార్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 3:30 PM IST
Hyderabad
X

Hyderabad: టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలని బీఆర్ఎస్ డిమాండ్!

Hyderabad: రోజురోజుకు రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ ను మించిపోతుంది. మొన్న కేబిఆర్ పార్క్ చుట్టూ అనాలోచితంగా 3000 చెట్లను నరికారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల పోటీ పరీక్షలు ఉన్న రోజే టీజీపీఎస్సీ పోటీ పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. ఇది శోచనీయం.

నవంబర్ 6, 7 తేదీల్లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సీ పరీక్షలు ఉన్నాయి. అదే రోజు R&బి ఏఈఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈనెల 26 న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సివిల్ ఇంజినీర్లను రేసీరియట్ రిక్రూట్ చేయడానికి పరీక్ష నిర్వహిస్తుంది. అదే రోజు పీసీబీలో ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెబుతోంది.

ఒకే రోజు రెండు నియామక పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని టీజీపీఎస్సీ పునఃసమీక్షించాలి. దీనివల్ల రెండు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేయాల్సిందే. నెలల తరబడి కష్టపడి చదువుతున్న నిరుద్యోగ యువతకు నష్టం జరగకుండా పరీక్షల తేదీలను వేర్వేరుగా ప్రకటించి, పరీక్షలను వాయిదా వేయాలి. అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం, టీజీపీఎస్సీ తక్షణమే స్పందించాలి. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. పరీక్షల తేదీలను మార్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్