LB Nagar: ఆదర్శవంతమైన పాలన బీఆర్ఎస్ సొంతం.. ఘనంగా జరిగిన ఆవిర్భావ వేడుకలు

LB Nagar: ఎల్.బి. నగర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. లిబర్టీ చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 27 April 2026 12:51 PM IST
LB Nagar
X

LB Nagar: ఆదర్శవంతమైన పాలన బీఆర్ఎస్ సొంతం.. ఘనంగా జరిగిన ఆవిర్భావ వేడుకలు

LB Nagar: ఈ రోజు భారత్ రాష్ట్ర సమితి (భారస) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు లింగోజిగూడా డివిజన్ పరిధిలోని లిబర్టీ చౌరస్తా వద్ద తెరాస పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ స్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దూరదృష్టి,నాయకత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలిపారు.ప్రజల సంక్షేమం,రైతుల అభ్యున్నతి,అభివృద్ధి దిశగా భారస ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని,ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, తిలక్ రావు, రాజశేఖరరెడ్డి, ఆడాల రమేష్, దయానంద్, రాకేష్ ఠాగూర్, జగన్నాద్ రెడ్డి, నర్సింహా గుప్తా, భాస్కర్ గంగపుత్ర, ఇంద్రాజీ, ఆశిష్, నాగేశ్వర్రావు, శ్రీధర్, ప్రకాష్, శ్రీకాంత్, చిత్రం సాయి, షఫీ, వెంకట్ రెడ్డి, రాజేందర్, ప్రసాద్, యశ్వంత్, రుద్ర శ్రీను, అనిల్, వెంకటేష్ గౌడ్, దిలీప్, అనూష, విజయ్ గౌడ్, దేవి, లక్ష్మి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story