Medchal: గుండ్లపోచంపల్లిలో 100 అడుగుల ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్ పోరుబాట!

Medchal: గుండ్లపోచంపల్లిలో కాంగ్రెస్ 24 హామీలపై బీఆర్‌ఎస్ 100 అడుగుల ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ. మద్దుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రా, 22ఏ వివాదాలపై ధ్వజం.

NAKSHATRAM, MEDCHAL
Published on: 2 Sept 2026 1:56 PM IST
Medchal
X

Medchal: గుండ్లపోచంపల్లిలో 100 అడుగుల ఫ్లెక్సీతో బీఆర్‌ఎస్ పోరుబాట!

Medchal: గుండ్లపోచంపల్లి డివిజన్ లో మద్దుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో 100 అడుగుల ప్లెక్సీ ని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పేదలకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునారని, హైడ్రా, 22ఏ వంటి అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story