Hyderabad: సనత్‌నగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బుట్టి రాజశేఖర్

Hyderabad: అమీర్‌పేట్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బుట్టి రాజశేఖర్ కాంగ్రెస్‌లో చేరిక. కోట నీలిమ, దీపక్ జాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న నేతలు.

RAJESH,	WEST ZONE
Published on: 1 July 2026 6:50 PM IST
Hyderabad
X

Hyderabad: సనత్‌నగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బుట్టి రాజశేఖర్

హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు బుట్టి రాజశేఖర్ తన మద్దతుదారులు రమ్య గౌడ్, చక్రధర్ యాదవ్‌తో కలిసి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ కోట నీలిమ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బుట్టి రాజశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ కోట నీలిమ నాయకత్వం, ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృషిపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ.. బుట్టి రాజశేఖర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం పలికారు. డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషకరమని అన్నారు.

బుట్టి రాజశేఖర్‌తో పాటు ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ కుటుంబంలో చేరడం వల్ల సనత్ నగర్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరడం పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి SS రావు, ఎస్‌ఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు రవికిరణ్ దేవులపల్లి ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story