Abdullapurmet: గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Abdullapurmet: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 6 Sept 2026 3:30 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్: కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగంగా అనాజ్‌పూర్ గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు, చెత్తాచెదారం సమస్యను ఆయన పరిశీలించారు.

గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల అమలు సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలహీనపరిచారని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story