Khairatabad: ఖైరతాబాద్‌లో మన్నే గోవర్ధన్ రెడ్డి "సమస్యలపై సమరం"!
Khairatabad: మన్నే గోవర్ధన్ రెడ్డి 'సమస్యలపై సమరం' చేపట్టారు. బీజేఆర్ నగర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిశీలించి, అధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు.
Khairatabad: ఖైరతాబాద్‌లో మన్నే గోవర్ధన్ రెడ్డి "సమస్యలపై సమరం"!
ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఖైరతాబాద్ డివిజన్‌లోని బీజేఆర్ నగర్, మహాభారత్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బీజేఆర్ నగర్‌లో కలుషిత నీటి సమస్య, స్ట్రీట్ లైట్ల సమస్యలను స్థానికులు గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అలాగే బీజేఆర్ నగర్‌లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సమస్యపై ఎలక్ట్రికల్ ఎస్‌ఈ, డీఈ, ఏఈ అధికారులకు లేఖ ద్వారా తెలియజేసి, ప్రతిరోజూ అధికారులతో ఫాలోఅప్ చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఈరోజు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం తెలుసుకోవడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం అధికారులపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చి ఫలితం సాధించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మన్నే గోవర్ధన్ రెడ్డి గారు తెలిపారు.
ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్జెల ఆనంద్, శామ్ గౌడ్, శ్రీనివాస్, అశోక్, అంజన్ కుమార్, అబ్బాస్, కన్నా యాదవ్, ఉస్మాన్, శేఖర్, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




